మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పెద్దన పల్లి పంచాయతీలో బృహత్ పల్లె ప్రకృతి వనం ప్రారంభం.

 పెద్దనపల్లి పంచాయతీలో బృహత్ పల్లె ప్రకృతి వనం ప్రారంభం.

 మదనపల్లి పంచాయతీలోని బృహత్ పల్లె పకృతి వనంలో మొక్కలు నాటుతున్న ఎంపీడీవో అలి సర్పంచ్ వేముల కృష్ణ 


Scv News Kasipet :--

 కాసిపేట మండలం పెద్దనపల్లి పంచాయతీలో బృహత్ పల్లె ప్రకృతి వనం ను ఎంపీడీవో ఎంఏ అలీ, పంచాయతీ సర్పంచ్ వేముల కృష్ణ, ఎంపీటీసీ రామ్ చందర్ శనివారం ప్రారంభించారు. నూతన దుబ్బగూడెం గ్రామ ఎదురుగా అటవీ శాఖకు చెందిన ఐదెకరాల భూమిని పెద్దనపెళ్లి గ్రామపంచాయతీ కేటాయిం చారు. ఈ స్థలంలో బ్రృహత్ పల్లె పకృతి వనం (BPVV) పార్క్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదాన్ని కలిగించే స్థలం ఏర్పాటు కృషి చేయడం జరిగితుందని గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ తెలిపారు. దీనిలో 15 వేల మొక్కులు పెట్టడం వల్ల చాలా అద్భుతంగా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొత్త రమేష్, కంచర్ల పద్మ,బొల్లపెల్లి కొమురక్క, వజ్ర,యంపివో, కార్యదర్శి నాగరాజు, ఏపివో నవీన్ ఇసి అరుణ్, పంచాయతీ కార్యద ర్శులు టెక్నికల్ అసిస్టెంట్ అనుష గ్రామస్తులు పాల్గొన్నారు