మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పెద్దన పల్లి నాయకపూ గూడెం లో ఆరోగ్య శిబిరం.

 పెద్దనపల్లి నాయకపుగూడెం

లో   ఆరోగ్య శిబిరం.



 పెద్దనపెళ్లి నాయక గూడెంలో ఆరోగ్య శిబిరం 


Scv News Kasipet :--

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం గ్రామంలో  మంగళవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామం మొత్తం బురదమయం కావడం వల్ల సీజనల్  వ్యాధులు మలేరియా టైఫాయిడ్  జ్వరాలు ప్రబలే   అవకాశం ఉండడంతో  ముందు జాగ్రత్తగా గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ  మండల ఆరోగ్య వైద్య అధికారులతో మాట్లాడి ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ దోమలు  నిల్వ ఉండే  పనికిరాని ప్లాస్టిక్ డబ్బాలను, టైర్లను,నీటి నిల్వలు లేకుండా చూడాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వైద్య శిబిరంలో  సమస్యలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి బీపీ షుగర్ టెస్ట్ లు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో  మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్మయి, జూనియర్ డాక్టర్ శ్రీ దివ్య, హాస్పిటల్ సిబ్బంది చంద్రశేఖర్, అసిస్టెంట్ నారాయణ,ఉప సర్పంచ్ సోమని మైసక్క, కార్యదర్శి నాగరాజు గ్రామ ప్రజలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు