మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

జాతీయస్థాయి మెరిట్ స్కాలర్ షిప్ కు నలుగురు మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక.

 జాతీయస్థాయి మెరిట్

స్కాలర్ షిప్ కు నలుగురు

మోడల్ స్కూల్ విద్యార్థుల

ఎంపిక.


Scv News Kasipet:--

 జాతీయ స్థాయి మెరిట్ స్కాలర్ షిప్ కోసం   NMMS జాతీయ స్థాయి (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్)  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు జరిగిన పరీక్షలలో కాసిపేట మండలం కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థులు ఎన్నికయ్యారని ప్రిన్సిపాల్ అందే నాగమల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారిలో  ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు K.సాత్విక, R.పవన్.S.అజయ్, S.శ్రీ క్షేత్రజ్ఞ లు ఉన్నారు.వీరికి  9వ,తరగతి నుండి  ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేసరికి  ప్రతి సంవత్సరం 12,000 స్కాలర్షిప్ మంజూరు కావడం జరుగుతుంది అని  పలితాల్లో విజయం సాధించిన విద్యార్థులను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అందే.నాగమల్లయ్య గారు SMC కమిటీ చైర్మన్  ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది.