నిరుపేద కుటుంబాన్ని
ఆదుకున్న అంబేద్కర్ సేవా
ఫౌండేషన్ అధ్యక్షుడు
అట్కాపురం రమేష్.
![]() |
| నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువులు అందించి ఆదుకుంటున్న దేవాపూర్ అంబేద్కర్ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు అట్కా పురం రమేష్ |
కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీ పరిధిలోని అచ్యుతరావు గూడెంలో నివసించే ఉరిత దివాకర్ నిరుపేద కూలి కుటుంబానికి దేవాపూర్ బిఆర్ అంబేద్కర్ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు అట్కాపురం రమేష్ 50 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు పండ్లు,బట్టలు మరియు ఎనిమిది వందల రూపాయలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉరిత దివాకర్ భార్య రాంబాయి ఇటీవల ప్రసవించింది. గత పది రోజులుగా వర్షాలు కురవడంతో కూలి పనులు దొరకక దివాకర్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసి అంబేద్కర్ సేవా ఫౌండేషన్ తరఫున అట్కా పురం రమేష్ గ్రామ పెద్దలు సేవా ఫౌండేషన్ సభ్యులు రామిళ్ళ కిష్టయ్య,పెద్ద నర్సయ్య,మాటూరి లక్ష్మణ్, అట్కాపురం ప్రవీణ్, నరసయ్య, నాగరాజు సాకేత్, దోమల రామ్ చందర్ ల సమక్షంలో నిత్యావసర వస్తువులను అందజేశారు. నిరుపేద కుటుంబానికి తన స్తోమత కనుగుణంగా ఆర్థిక సహాయం చేసినా అట్కాపురం రమేష్ కు సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూప్ ప్రత్యేక అభినందనలు. రమేష్ ను స్ఫూర్తిగా తీసుకొని భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలను మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన విధంగా ఆదుకోవాలని కోరుతుంది.
