మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ నాయకపు గూడెంలో పసక దేవర పూజలు.

 దేవాపూర్ నాయకపు

గూడెంలో పసక దేవర

పూజలు.

 దేవాపూర్ నాయకపుగూడెంలో పసక దేవరకు మొక్కులు తీర్చుకుంటున్న గిరిజనులు.
 
Scv News Kasipet :--

కాసిపెట్ మండలంలోని దేవాపూర్ పంచాయితీ పరిధిలోని నాయకపు గూడలో ఆదివారం నాడు నాయకపొడ్ ఆదివాసులు పసక దేవర పూజలు చేశారు. సాంప్రదాయ ప్రకారంగా ముందుగా ఊరు పోచమ్మ తల్లికి పూజలు నిర్వహించి సమీపంలోని అటవీ ప్రాంతానికి శివారుకు వెళ్లి పస్కారా దేవర రాజుల విగ్రహాలకు పూజలు చేసి నైవేద్యం కొబ్బరికాయలు సమర్పించి జంతు బలులు ఇస్తారు. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడాలని పంటలు పండాలని వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడాలని పశువులకు మేకలకు ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడాలని అడవికి వెళ్ళినప్పుడు క్రూర జంతువుల నుండి విష సర్పాలు క్రిమి కీటకాల నుండి రక్షణ కల్పించాలని సామూహిక పూజలు చేసినారు. ఈ పూజా కార్యక్రమంలో రోడ్డ లచ్చులు పూజారి,రోడ్డ రాజం గ్రామ పెద్దమనిషి,గడ్డం భీమయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు,బైరనేని గోపాల్,కలకానీ లక్ష్మి,రోడ్డ నాగక్క రోడ్డ రాజేశ్వరి,కొమ్ముల సత్తక్క,రోడ్డ శంకరమ్మ లు పాల్గొన్నారు.