తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మ్యూచువల్ ఫండ్ ప్రారంభం.
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలోని ముత్యం పెళ్లి తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో మ్యూచువల్ ఫండ్ సేవల శాఖ ఏర్పాటు చేయడం జరిగిందని బ్యాంకు మేనేజర్ రాజేష్ ప్రసాద్ తెలిపారు. పొదుపు చేయాల్సిన బ్యాంకు ఖాతాదారు లు మ్యూచువల్ ఫండ్ లో చేరాలని కోరారు. నెలకు 500 రూపాయలు మొదలుకొని పది వేల రూపాయల వరకు పొదుపు చేసుకోవచ్చని తెలిపారు. పెట్టుబడులు,రాబడుల కు సంబంధించిన వివరాల కోసం తనను సంప్రదించాలని బ్యాంక్ మేనేజర్ రాజేష్ ప్రసాద్ తెలిపారు.
