కస్తూరిబా పాఠశాలను
సందర్శించి న ఎమ్మెల్యే
దుర్గం చిన్నయ్య.
Scv News Kasipet :--
గత కొద్ది రోజులుగా కురుస్తున్న అతిభారీ వర్షాలకు కాసిపేట మండల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ ప్రాంగణంలో నీరు నిల్వ అయిందనే సమాచారం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య ఆదివారం హుటాహుటిన మండల కేంద్రానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. భారీ వర్షాల వల్ల విద్యాలయం ప్రాంగణం చుట్టూ పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. నీరు బయటకు వెళ్లేలా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. భవిష్యత్తులో ప్రాంగణంలో నీరు నిలువకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు సంబంధిత అధికారులకు ఫోన్ లో ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల తరగతులను పరిశీలించి విద్యార్థినిలతో కొద్దిసేపు మాట్లాడారు. పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తమకు తెలియపర్చాలని,వైస్ ఎంపీపీ విక్రమ్ గారు,ఉప సర్పంచ్ తిరుపతి మరియు ఇతర తెరాసా నాయకులు అందుబాటు లో ఉంటారని, తాము వెంటనే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు .
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విక్రమ్ , ముత్యంపల్లి ఉపసర్పంచ్ తిరుపతి , ఇతర ప్రజాప్రతినిధులు, బెల్లంపల్లి పట్టణ TRSV అద్యక్షుడు శ్రావణ్ , వైస్ ప్రెసిడెంట్ యూనుస్ , తెరాసా నాయకులు, కాసిపేట ఎస్ఐ గంగారం సంబంధిత అధికారులు పాల్గొన్నారు .

