మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో భారీ వర్షాలకు తీవ్ర నష్టం.

 కాసిపేట మండలంలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం. 

 దేవాపూర్ మేజర్ పంచాయితీ లోని కాశీరం గూడెం లో భారీ వర్షాలకు రహదారి బురదమయం అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.
 గ ట్రావుపల్లి పంచాయతీలోని బుగ్గవాగు చెరువు లో ప్రమాద స్థాయికి చేరిన నీరు  

Scv News Kasipet:--

రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేకపోతు న్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. కాసిపేట మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కు ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటు న్నారు. వివిధ గ్రామాలలోని వాగులు ఉప్పొంగడం వల్ల   గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెరువుల ని నిండి మత్తడి పారుతూ ప్రమాద స్థాయికి చేరు కుంటున్నాయి. వర్షపు  నీరు మురికి కాలువల నుండి వెళ్ళాక  ఇళ్లలోకి  వస్తుండడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పశువులు, మేకలు, గొర్రెలు మేతకు బయటికి వెళ్ళ లేక ఆకలి తో అలమటిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు చేలు జాలు పడి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గట్ రావుపల్లె పంచాయతీ పరిధిలోని బుగ్గచెరువు పూర్తిగా వెండి ప్రమాద స్థాయికి చేరడంతో సర్పంచ్ పద్రం రాజు  రెండు తూముల గేట్లు తెరిచి నీటిని కాలువలకు వదిలారు.

 పెద్దనపెళ్లి గ్రామానికి వెళ్లే రహదారి  రాళ్లవాగు పరిశీలిస్తున్న పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ 

పెద్దనపెళ్లి పంచాయతీ పరిధిలోని రాల్ల వాగు పొంగి పొర్లుతుందడంతో పెద్దన్న పెళ్లి నాయకుడు గిరిజనులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లి వరకు చేపట్టిన రహదారి నిర్మాణము వంతెన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో గ్రామస్తులకు వర్షాకాలంలో రహదారి లేకుండా పోయిందని గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ వాపోయారు. రహదారి వంతెన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

 కోమటి చేను గ్రామంలో ప్రధాన రహదారి పైపులలో చెత్త నిండడం తో  నీరు నిలిచి గ్రామం లోకి వస్తుంది. గ్రామ సర్పంచి రామ టైంకి శ్రీనివాస్ వర్షంలో పైప్లైన్ లను శుభ్రం చేస్తున్న దృశ్యం 

కోమటి చేను పంచాయితీలో మురికి కాలువలో నీ పైపులు నిండడం తో మీరు వెళ్ళలేక గ్రామంలో నిలిచిపోయింది. వర్షం నీరంతా   ఇళ్లలోకి వస్తుండడంతో సర్పంచ్ రామటెంకి  శ్రీనివాస్  వర్షంలో నిలబడే గ్రామ యువకులు పంచాయతీ సిబ్బంది తో పైపులను శుభ్రం చేయించి నీళ్లు వెళ్లే ప్రయత్నం చేశారు.



దేవాపూర్ మేజర్ పంచాయతీ లో భారీ వర్షానికి వర్షపు నీరంతా నిరుపేద కూలీలకు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాశీ రామ్ గూడెం లో రహదారి మొత్తం బురదమయం కావడంతో గ్రామస్తులు నడవలేక పోతున్నారు. వీధిలో లైట్లు లేకపోవడంతో రాత్రులు పాములు వచ్చిన కనపడడం లేదని భయం భయంగా బ్రతుకుతున్నాం అని కాలనీవాసులు వాపోతున్నారు.ప్రధాన వంతెనకు గండి.దేవాపూర్ పంచాయితీలో  మేదర్ బస్తీ నుండి గొల్లవాడ కు వెళ్లే ప్రధాన వంతెన వరద నీటికి  గండి పడి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వంతెన మరమ్మత్తుల పనులు వెంటనే చేపట్టాలని బిజెపి మండల నాయకుడు అటకపురం రమేష్  ఎంపీడీవో కు ఫిర్యాదు చేశారు.