కాసిపేట మండలం లో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.
Scv News Kasipet :--
కాసిపేట మండలంలో వివిధ గ్రామాల నుండి యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో రోజురోజుకు మండల కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ణ నియామకం జరిగిన అప్పటినుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల వేముల కృష్ణ నాయకత్వంలో ,సోమగుడెం (కే) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ ఆధ్వర్యంలో సోమగుడెంకి చెందిన ఇరవై మంది యువకులు మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన చేరిన యువత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని యువత ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోడానికి పార్టీలో చేరుతున్నామని తెలిపారు. అలాగే దేశంలో మరియు రాష్ట్రంలో నడుస్తున్న యువత వ్యతిరేఖ విధానలైన అగ్నిపథ్ మరియు ఇక్కడి నిరుద్యోగ భృతి పథకం ప్రకటించి దాన్ని అమలు చేయకుండా యువతని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్న తరుణంలో యువతకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్వచ్చందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వారు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాధం గట్టయ్య, మహేష్ శ్రీధర్ లు పాల్గొన్నారు.

