కాసిపేట మండలం దేవాపూర్ నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు.
![]() |
| మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో దేవాపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు |
కాసిపేట మండలంలోని దేవపూర్ మేజర్ పంచాయతీ లోని వివిధ వార్డులకు చెందిన 80 మంది యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం వినోద్, ఓబీసీ స్టేట్ వైస్ ఛైర్మెన్ బండి ప్రభాకర్, మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్,కాసిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల కృష్ణ గారి ఆధ్వర్యంలో దేవాపూర్ నుండి బోర్లకుంట ప్రణయ్, రామటెంకి ప్రవీణ్ గార్లతో 80 మంది యువకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ MLC ప్రేమ్ సాగర్ రావు గారి చేతుల మీదగా కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్భం గా రత్నం ప్రదీప్ మాట్లాడుతు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం కాయం అని ఎవరైనా యువకులు రాజకీయాల్లోకి రావాలి అంటే రావొచ్చు అని వాళ్ళకి ప్రేమ్ సాగర్ రావు గారు మరియు గడ్డం వినోద్ గారి నాయకత్వం లో మంచి భవిష్యత్ ఉంటుంటుందని పేర్కొన్నారు. కార్యకర్తలికి ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చిన కాపాడుకొనే నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారు ఉండంగా ఎవరికీ భయ పడాల్సిన అవసరం లేదని తెలిపారు . ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు, పిడుగు మనోహర్,గుండా రాజకుమార్, పల్లపు మహంకాళి, కోట ఆదర్శ్వీన్ తదితరులు పాల్గొన్నారు.

