గ్రామ సభను అడ్డుకున్న దేవాపూర్ వాసులు.
Scv News Kasipet :--
కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారం నాలుగో ప్లాంట్ విస్తరణ చేపట్టేందుకు భూసేకరణ కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామ సభను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. గతం లో నిర్మించిన మూడు ప్లాంట్లలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ కంటే ముందు ప్లాంటు నిర్మాణంలో ఎంతమందికి ఉపాధి కల్పిస్తారో లిఖితపూర్వకంగా తెలియజేయలని స్థానిక నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అంతవరకు గ్రామ సభ నిర్వహించేది లేదని రెవెన్యూ అధికారులను అడ్డగించారు. గ్రామసభ నిర్వహణ కోసం వచ్చిన తాసిల్దార్ దిలీప్ కుమార్ ఎంత నచ్చజెప్ప ప్రయత్నించిన స్థానికులు వినలేదు. చేసేదిలేక రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించ కుండానే వెనుతిరిగారు. తమ డిమాండ్ల వినతి పత్రాన్ని స్థానిక నాయకులు తాసిల్దార్ దిలీప్ కుమార్ కు అందజేశారు.
