దుబ్బగూడెం గ్రామాన్ని
సందర్శించి బాధితులను
పరామర్శించిన ఎమ్మెల్యే
దుర్గం చిన్నయ్య.
![]() |
| దుబ్బగూడెం గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య |
Scv News Kasipet :--
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అతిభారీ వర్షాలకు కాసిపేట మండలం దుబ్బగుడెం గ్రామానికి చెందిన కొందరి ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. ఈరోజు దుబ్బగూడెం గ్రామాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ ఇండ్లు కూలిపోయిన బాధితులందరికీ ఉన్నతాధి కారులతో మాట్లాడి పునరావాసం కల్పి స్తామని, సింగరేణి ఓపెన్ కాస్ట్ లో గృహలు కోల్పోయిన వారికి అతి త్వరలో నష్ట పరిహారం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అతిభారీ వర్షాల కారణంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తమకు తెలియచేయాలని, నియోజకవర్గ ప్రజల సేవ కోసం తానెప్పుడూ సంసిద్ధంగా ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట దుబ్బగూడెం గ్రామాన్ని సందర్శించిన వారిలో గ్రామ సర్పంచి ధరావత్ దేవి కొండయ్య, ఎంపీటీసీ అక్కేపల్లి లక్ష్మీ, తహసిల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీఓ ఎం ఏ అలీమ్ తెరాస నాయకులు అక్క పెల్లి బుగ్గ రాజు , స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

