బ్యాంకు పథకాలపై కోమటి
చేను గ్రామస్తులకు
అవగాహన.
Scv News Kasipet :--
కాసిపేట మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముత్యంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం నాబార్డ్ వారి సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమo నిర్వహించారు. కోమటిచెన్ పంచాయతీ పరిధిలోని గ్రామైక్య సంఘాలకు M.V రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత బృందం వారు బ్యాంకు లో ఉన్నటువంటి పథకాల గురించి రుణాల గురించి ముఖ్యంగా సామాజిక భద్రతా పథకాల గురించి పాటలు కథల ద్వారా వివరించారు. జీవన జ్యోతి భీమ యోజన పథకం, సురక్ష భీమా పథకం, అటల్ పెన్షన్ యోజన పథకం ఇన్సూరెన్స్ లా పథకాల గురించి మ్యాజిక్ షో ద్వారా మాటల ద్వారా పా టల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. ఈ కార్యక్రమంతో బ్యాంకు మేనేజర్ రాజేష్ ప్రసాద్, ఆఫీసర్ కిషోర్ , సర్పంచ్ శ్రీనివాస్ ,సీసీ లక్ష్మి ,ca మల్లేష్ ,AMC Director Vasudev, గ్రామా ప్రజలు తదితరులపాల్గొన్నారు
