కాసిపేట మండలంలో తుడుందెబ్బ బంధు విజయవంతం.
Scv News Kasipet :--
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషం గూడ ఆదివాసి మహిళలపై అడవి అధికారుల దాడులకు నిరసనగా ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పిలుపుమేర మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బందు పిలుపు లో భాగంగా ఈరోజు కాసిపేట మండలం ఏజెన్సీలో సంపూర్ణంగా బంధు నిర్వహించడం జరిగింది. దేవాపూర్, కొండాపూర్, కాసిపేట, ముత్యంపల్లి గ్రామాలలో దుకాణాలు ముసివేశారు. బంధు విజయవంతానికి తుడుందెబ్బ ఆదివాసి నాయక్ పోడ్ గిరిజన సంఘాల నాయకులు గ్రామాలలో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బందులో పాల్గొన్న వారిని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఆడే జంగు, ఆదివాసీ నాయక్ పోడ్ సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు మడవి వెంకటేష్, మండల అధ్యక్షుడు ఆత్రం జంగు, ఆదివాసి నాయకపోడ్ మండల అధ్యక్షులు బద్ధి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో తుడుం దెబ్బ, ఆదివాసి నాయక్ పోడ్ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

