మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బుగ్గ గూడెం గ్రామం లో ఆర్థిక అక్షరాస్యత సదస్సు.

 బుగ్గ గూడెం గ్రామం లో

ఆర్థిక అక్షరాస్యత సదస్సు.



Scv News Kasipet

 కాసిపేట మండలం బుగ్గగూడెం గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం  ఆర్థిక అక్షరాస్యత సదస్సు జరిగింది. బ్యాంకు సిబ్బంది పొదుపు గురించి డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులకు  వివరించారు. బ్యాంకులో పొదుపు చేసుకున్న డబ్బులు భవిష్యత్తులో కుటుంబ అవసరాలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది అని వివరించారు.అన్ని బ్యాంకుల కంటే తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో డిపాజిట్ చేసుకుంటే ఎక్కువ వడ్డీ వస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి యోజన బీమా పథకం గురించి వివరించి ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏదుల విజయలక్ష్మి,ఉప సర్పంచి రఘుపతి, టి జీ బి  మేనేజర్ రాజేష్ ప్రసాద్, బ్యాంక్ సిబ్బంది కిషోర్, స్థానిక నాయకులు రఘుపతి తదితరులు పాల్గొన్నారు.