మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఆదివాసుల మీద దాడులకు నిరసనగా ఈనెల 11న బందును విజయవంతం చేయాలని తుడుందెబ్బ పిలుపు.

 ఆదివాసుల మీద దాడులకు

నిరసనగా ఈనెల 11న

బందును విజయవంతం

చేయాలని తుడుందెబ్బ

పిలుపు.

Scv News Kasipet :--

 మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెం ఆదివాసుల పై ఫారెస్ట్ అధికారుల దాడులకు నిరసనగా నెల 11వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా బందుకు తుడుం దెబ్బ  పిలుపునిచ్చిన దృష్ట్యా  కాసిపేట  మండలం బంద్ ను విజయవంతం చేయాలని మండల  తుడుం దెబ్బ కమిటీ అధ్యక్షుడు ఆత్రంజంగు, ప్రధాన  కార్యదర్శి మడవి వెంకటేష్ ప్రకటనలో తెలిపారు.

 ఇటీవల కోయ పోష గూడెం గిరిజన మహిళలు పోడు వ్యవసాయం చేసినందుకు అటవి అధికారులు కేసు నమోదు చేయడంతో జైలుకు వెళ్లి వచ్చారు.పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గత జూన్ నెలలో  గిరిజన  సంఘాల ఆధ్వర్యంలో గిరిజనులు దండేపల్లి నుండి ఉట్నూర్ ఐ టి డి ఏ కార్యాలయం వరకు పాదయాత్ర తో వెళ్లి  ప్రాజెక్టు అధికారికి మెమోరాండం ఇచ్చారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై కుట్రలు పన్ని అడవుల నుండి వెళ్లగొట్టేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసుల హక్కులను కాపాడు కునేందుకు తుడుందెబ్బ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలిపారు. బందును విజయవంతం చేసేందుకు కొండాపూర్ యాపలో శుక్రవారం తుడుం దెబ్బ  మండల కమిటీ సమావేశమై తీర్మానించింది అని ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో తుడుందెబ్బ మండల ఉపాధ్యక్షులు పేంద్ర శంకర్ , ఆత్రం సంజీవ్, కోశాధికారి పెంద్రం  ప్రభాకర్ , సలహాదారులు  మడవి గంగారం, మధుకర్, రామ్ పటేల్, కుమ్రం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.