మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఆదివాసుల పై దాడి చేసిన ఫారెస్ట్ అధికారుల పై చర్యలు తీసుకోవాలి.

 ఆదివాసుల పై దాడి చేసిన ఫారెస్ట్ అధికారుల పై చర్యలు తీసుకోవాలి.

- కాసిపేట మండల ఆదివాసి నాయక్ సంఘం డిమాండ్.


Scv News Kasipet :--

మంచిర్యాల జిల్లా దండేపెళ్లి మండలం కోయం పోచం గూడా ఆదివాసి మహిళలపై దాడి చేసిన అటవీశాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాసిపేట మండల ఆదివాసి నాయక్ పోడ్ మండల శాఖ అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అదేవిధంగా తెలంగాణ మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించి కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆదివాసి మహిళ లపై జరిగిన దాడికి నిరసనగా ఆదివారం సోనాపూర్ గ్రామంలో రహదారిపై నిలబడి నాయక్ పోడ్ సేవా సంఘం నాయకులు నిరసన తెలిపారు.

అటవీశాఖ అధికారుల తీరుకు నిరసనగా దెబ్బ పిలుపు మేరకు ఈ నెల 11న ఉమ్మడి జిల్లా బందును విజయవంతం చేయాలని మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొనాలని కోరారు.