దేశాన్ని తాకట్టు పెడుతున్న
మోడీ ప్రభుత్వం.
- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం
చిన్నయ్య
- దేవాపూర్ మేజర్ పంచాయతీలో ఎమ్మెల్యే
దుర్గం చిన్నయ్య పర్యటన.
- సిమెంటు రహదారులు,
క్రీడా ప్రాంగణం
ప్రారంభోత్సవం.
Scv News Kasipet :--
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం దేశంలోని లాభాల్లో ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను ఆదాని, అంబానీలకు అమ్మి ప్రైవేటు పరం చేస్తూ దేశాన్ని తాకట్టు పెడుతున్నడని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. శనివారం కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతు దేశాన్ని కాపాడే మిలటరీ ని కూడా ప్రైవేటు పరం చేయాలనే దుర్బుద్ధితో 'అగ్నిపత్ 'అనే పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని నిరసిస్తూ దేశంలో అల్లర్లు చెలరేగు తున్నాయి ఆరోపించారు.దేశంలో లాభాల బాటలో పయనిస్తున్న పరిశ్రమలను, ఎల్ఐసి సంస్థలను దివాలా తీయించే విధంగా ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు.
మరోవైపు రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో పయనించే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారన్నారు. ఒక వైపు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు, మరో వైపు పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుంద న్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆసరా,కల్యాణలక్ష్మి, రైతుబంధు,దళిత బంధులాంటి పథకాలను ప్రవేశపెట్టడ న్నారు. గ్రామాలలో పర్యావరణ పరిరక్షణతో పాటు,పచ్చదనం పరిశుభ్రత కోసం హరితహారం, పల్లె పకృతి వానాలను ఏర్పాటుచేసి ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని కొనియాడారు. కెసిఆర్ ప్రభుత్వ అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్, బిజెపి నాయకులు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా వేదిక ప్రభుత్వంపై పార్టీపై వచ్చే విమర్శలను పార్టీ నాయకులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.




