మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చాలని వీఆర్ఏ ల నిరసన.

ముఖ్యమంత్రి హామీలను

అమలు చేయాలని వీఆర్ఏ

ల నిరసన.


Scv News Kasipet :---

కాసిపేట మండల తాహాసిల్దార్ కార్యాలయం ముందు గురువారం వీఆర్ఏలు ముఖ్యమంత్రి ప్రకటించిన పే స్కేల్ లో అమలు చేయాలని, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ తో నిరసన వ్యక్తం చేశారు. 2020 సెప్టెంబర్ 9న నూతన రెవెన్యూ చట్టం తెస్తున్న సందర్భంగా అసెంబ్లీలో  విఆర్ఏ లందరికీ పే స్కేలు  వర్తింప చేస్తామని వీఆర్ఏల స్థానంలో తండ్రి స్థానంలో వారసులకు ఉద్యోగాలు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని వీఆర్ఏలు తెలిపారు . ముఖ్యమంత్రి కెసిఆర్ తాను ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ తాహాసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఏల నిరసనకు తాహాసిల్దార్ దిలీప్ కుమార్ సంఘీభావం తెలిపారు. నిరసన అనంతరం వీఆర్ఏ తహసిల్దార్ దిలీప్ కుమార్ కు  మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ ఏ లు శ్రీనివాస్, కార్తీక్, శ్రీకాంత్, సరితా,దినేష్,మహ్మద్ పాల్గొన్నారు.