మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.

 కాసిపేట మండలంలో

ఘనంగా తెలంగాణ

ఆవిర్భావ దినోత్సవం.



Scv News Kasipet :---

 కాసిపేట మండలంలో ని వివిధ గ్రామాలలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో  ని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ రొడ్డ లక్ష్మి, తహసిల్దార్ కార్యాలయం  లో తహసిల్దార్ దిలీప్, సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ బుక్యా నిలా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపిపి విక్రమ్ రావు, టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోటురి వేణు, ఎంపిటిసిలు సర్పంచ్లు పాల్గొన్నారు. గ్రామాలలో తెరాస పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జెండాను ఎగురవేసారు.



దుబ్బ గూడెం గ్రామంలో జన సమితి ఆధ్వర్యంలో ....

 కాసిటల్ మండలం దుబ్బ గూడెం గ్రామంలో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ బి బాబన్న మంచిర్యాల జిల్లా నాయకులు గోనెల శ్రీనివాస్, శ్రీలత రామచంద్రారెడ్డి, భీమ్ రావు కనకరాజు, బచ్చలి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


కొండాపూర్ గ్రామంలో....

కొండాపూర్ చౌరస్తా లో తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు కంది ధర్మయ్య జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మక్కల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ బందెల ప్రేమ్ కుమార్   పార్టీ ప్రధాన కార్యదర్శి రంగు రమేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోడేటి రాజగౌడ్, మండల తెరాస గిరిజన కమిటీ అధ్యక్షుడు మడవి వెంకటేష్, స్థానిక నాయకులు గంగారాం, లక్ష్మణ్  కార్యకర్తలు పాల్గొన్నారు.


ధర్మ రావు పేట లో...

ధర్మ రావు పేట గ్రామంలో తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు బోనాల సత్యనారాయణ జెండాను ఎగరవేశారు. కార్యక్రమం లో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, సుధాకర్ రెడ్డి, జలపతి రెడ్డి, బాస వేణి కొమురయ్య, జంగిలి రమేష్  తదితరులు పాల్గొన్నారు.