మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం.

 దేవాపూర్ లో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో  తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం.



Scv News Kasipet :--

 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కాసిపేట మండలం దేవాపూర్ లోని కృష్ణ యాదవ సంఘ భవనంలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు శాలువాలతో  సన్మానించడం జరిగింది. సన్మానించిన వారిలో దేవాపూర్ జేఏసీ కన్వీనర్ మడావి కేశవరావు, కొమ్ముల బాపు, సండ్ర భూమన్న, మెరుగు మల్లేష్, కాసిపేట మండల తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి పోలీసు లాఠీ దెబ్బలు, కేసులోజైలు పాలై ఎన్నో త్యాగాలు చేసి  గుండెపోటుతో మరణించిన తెలంగాణ పోరాట యోధుడు అమరుడు  దాసరి శ్రీనివాస్ భార్య దాసరి సంగీతను సామాజిక  చైతన్య వేదిక నాయకులు స్థానికులు   శాలువాలతో సన్మానించారు.


ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిందని ఆ పోరాట యోధులను తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం అని భావించి సామాజిక చైతన్య వేదిక తెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన  ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.


 ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సామాజిక చైతన్య వేదిక ఉపాధ్యక్షులు మేరుగు శంకర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం  తెలంగాణ సబ్బండ వర్గాల పోరాటం ఫలితంగానే వచ్చిందని అన్నారు. దేవాపూర్ గ్రామంలోని అన్ని కులాల వారే కాకుండా, పరిసర గిరిజన గూడాల నుండి కూడా పెద్ద ఎత్తున గిరిజనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. వారి పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారి త్యాగాలను గుర్తు చేసుకునేందుకే సామాజిక చైతన్య వేదిక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిందని అన్నారు.


దేవాపూర్ జేఏసీ కన్వీనర్ మాడవి కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో అన్ని వర్గాలు సహకరించాయన్నారు. మా ఉద్యమకారులను గుర్తించి సామాజిక చైతన్య వేదిక  సన్మానించడం అభినంద నీయమని అన్నారు.


సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని వారి త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. కాసిపేట మండలంలో అమరుడు దాసరి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించాడని గుర్తుచేశాడు. స్వాతంత్ర ఉద్యమం కూడా ఎంతోమంది బలిదానం వల్లనే వచ్చిందని అలాంటి పోరాట యోధులను ఎప్పుడు గుర్తుంచుకోవాలని అన్నారు.

సండ్ర భూమన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సహకరించడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ లో మరిచిపోయిందని అన్నారు.


మేరుగు మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఒక కెసిఆర్ వల్లనే రాలేదని సబ్బండ వర్గాల పోరాట ఫలితంగానే వచ్చిందన్నారు.  యాదవ సంఘం పెద్దమనిషి కాసడి భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కుటుంబాలతో సహా ఉద్యమంలో పాల్గొన్న మన్నారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు క సాది రమేష్, సామాజిక చైతన్య వేదిక నాయకులు మహేష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.