తాగునీటి కోసం
దుబ్బగూడెం వాసులు
రహదారిపై నిరసన.
Scv News Kasipet :--
కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామస్తులు తాగునీటి కోసం మండల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వ హించారు. గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక సర్పంచ్ దేవికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపిన పట్టించుకోవడంలేదని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించడంతో రోడ్డుపై వాహనాలు నిలిచి వాహన దారులు ఇబ్బందులకు గురయ్యారు.