రహదారి మరమ్మత్తు కోసం
ఎంపీడీవో కు బిజెపి
నాయకుల వినతి.
Scv News Kasipet :---
కాసిపేట మండల్ చిన్న ధర్మారం గ్రామంలోని వాటర్ ట్యాంక్ మరియు రోడ్డు మరమ్మతుల కోసం బిజెపి ఆధ్వర్యంలో మంగళ వారం ఎంపీడీవో ఎం ఏ అలీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సురం సంపత్ మాట్లాడుతూ చిన్న ధర్మారం కొత్త గ్రామపంచాయతీ ఎన్నో సంవత్సరాల గడిచిన కనీస అభివృద్ధి నోచుకోలేదని సర్పంచ్ కు ఎన్నోమార్లు గ్రామ సభలో వాటర్ ట్యాంక్ శిథిలావస్థలో ఉందని మరియు ముత్యం పెళ్లి నుండి చిన్న ధర్మారం గ్రామపంచాయతీ వరకు రోడ్డు అద్వాన పరిస్థితిలో ఉందని పలుసార్లు చెప్పిన పట్టించుకోలేదని విమర్శించారు. గ్రామ సమస్యల ను తక్షణమే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్కా పురం రమేష్ ,బీజేవైఎం జనరల్ సెక్రెటరీ సూరo సంపత్ కుమార్,బూత్ అధ్యక్షులు శ్రీకాంత్, గ్రామ పెద్దలు గ్రామ యువకుల తుమ్మ తిరుపతి, నారాయణ, శ్రీనివాస్ ,సూరం వినోద్ కుమార్, ఎండి అజీమ్, మహేందర్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు

