పెద్దనపల్లి లో గాలివానకు ఇల్లు ధ్వంసం.
Scv News Kasipet :---
కాసిపేట మండలం పెద్దనపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దనపల్లి గ్రామంలో బుధవారం రాత్రి గాలి వానకు నిరుపేద అయిన గుండం లక్ష్మీ- బుచ్చయ్య ఇల్లు కూలి ధ్వంసమైంది. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే బుచ్చయ్య దంపతులు రాత్రి పడుకునే సమయంలో వచ్చిన భారీ వర్షం గాలివానకు ఇల్లు నేలకూలింది. కొద్ది సమయంలో ముందు పక్క వాళ్ళ ఇంటికి వెళ్లడంతో బుచ్చయ్య దంపతులు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించు కున్నారు. ఇల్లు కూలడంతో ఇంటిలోని సామాను మొత్తం ధ్వంసమైంది. పంచాయతీ సర్పంచ్ వేముల కృష్ణ గ్రామాన్ని సందర్శించి ఆ పేద దంపతులను ఓదార్చారు. ఇల్లు నేలకూలిన విషయం పై అధికారులకు తెలియజేసి తద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుపేద గుండం బుచ్చయ్య దంపతులను ఆదుకోవాలని మానవతా వాదులను సర్పంచ్ వేముల కృష్ణ కోరారు .

