మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో పర్యావరణ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమం

 పర్యావరణ పరిరక్షణలోనే

మానవ జీవితం ఆధారపడి

ఉంది.

 -సామాజిక చైతన్య వేదిక

అధ్యక్షుడు పల్లె మల్లయ్య.



Scv News Kasipet:---

 పర్యావరణ సమతుల్యంగా ఉండి పరి రక్షించ పడినప్పుడే ఈ భూమి మీద జీవకోటి మనుగడ సాధ్యమని పర్యావరణం మీదనే మానవ జాతి ఆధారపడి ఉందని సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య అన్నారు. ప్రపంచపర్యావరణ దినోత్సవ సందర్భంగా కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయితీలోని పకృతి వనంలో పంచాయతీ సిబ్బంది, సామాజిక చైతన్య వేదిక సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.

ఈ సందర్భంగా పల్లె మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. హరితహారం, పల్లె పకృతివనాల ఏర్పాటు,రహదారుల కు ఇరువైపుల మొక్కలు నాటడం తో తెలంగాణలో పచ్చదనంతో  పర్యావరణం పరిరక్షించు పడుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ సందర్భంగా మండలంలోని  పంచాయతీలలో  ప్రభుత్వ అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సర్పంచ్ లు వార్డు మెంబర్లు కూడా పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందని అన్నారు.


పంచాయతీ కార్యదర్శి కవిత మాట్లాడుతూ దేవాపూర్ పంచాయితీలో ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం విరివిగా చేపడుతున్నామని అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పకృతి వనంలో  చనిపోయిన మొక్కలు స్థానంలో మళ్లీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటడం జరిగింది అని అన్నారు.
సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ  పర్యావరణ తుల్యంగా ఉండాలంటే భూమిమీద మూడు శాతం అడవులు ఉండాలని అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో చెట్లను   నరకడం వల్ల  అడవులు 15 శాతానికి పరిమితం అయ్యాయని దీనివల్ల పర్యావరణం దెబ్బతిని వాతావరణంలో మార్పులు వచ్చాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  కెసిఆర్ ప్రభుత్వం హరితహారం, పకృతి  వనాల పేరిట   మొక్కలు గ్రామాలలో నాటిస్తుండ టం వల్ల  రాష్ట్రంలో అడవులు  శాతం పెరుగుతుందని అన్నారు. ప్లాస్టిక్ వాడటంవల్ల పర్యావరణం దెబ్బతిని ఉచిత వాతావరణం ఏర్పడి మానవుల జీవితాలు ప్రమాదకరమని అన్నారు. పరిరక్షణలో భాగంగా అందరూ చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సామాజ  చైతన్య వేదిక ఉపాధ్యక్షుడు మెరుగు శంకర్ మాట్లాడుతూ  పకృతిలో జీవజాలం బాగుండాలంటే పర్యావరణ పరిరక్షణ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. పర్యావరణం సమతుల్యంగా ఉంటేనే మానవ జీవితం సక్రమంగా ఉంటుందన్నారు. గ్రామాలలో ప్రతి ఒక్కరూ  బాధ్యతతో మొక్కలు నాటి పరిరక్షించాలని కోరారు. తదనంతరం మానవ జీవితంలో  చెట్ల ప్రాధాన్యత విషయమై కొమ్ముల బాపన్న పాట పాడారు. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక నాయకులు సండ్ర భూమయ్య పంచాయతీ సిబ్బంది శ్యామ్ సుందర్, వెంకటేష్ శ్రీనివాస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.