మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

రైతులు సకాలంలో పంట రుణాలు చెల్లించాలి.

 రైతులు సకాలంలో పంట రుణాలు

చెల్లిస్తే వడ్డీ లో మూడు శాతం

రాయితీ

-  రాజేష్ ప్రసాద్,

ముత్యంపల్లి తెలంగాణ  గ్రామీణ బ్యాంకు మేనేజర్.



Scv News Kasipet:--

 కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుండి పంట రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లిస్తే వడ్డీలో 3 శాతం రాయితీ లభిస్తుందని బ్యాంక్ మేనేజర్ రాజేష్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తీసుకున్న పంట రుణాలు మా బ్యాంకులో అతి తక్కువ వడ్డీ 7 శాతానికి ఇస్తున్నామని వాటిని సంవత్సరంలోగా రైతులు చెల్లిస్తే ప్రభుత్వ ప్రోత్సాహం గా 3 శాతం వడ్డీ తగ్గిస్తామని తెలిపారు.

 రైతులు సంవత్సరంలోపు వడ్డీ చెల్లించ నట్లయితే వడ్డీ 13% భారం పడుతుందని అన్నారు. రైతులు నిర్లక్ష్యంతో పంట రుణం రెన్యువల్ చేసుకోకపోవడంతో అధిక వడ్డీ భారం పడి నష్టపోతారని తెలిపారు. మహిళా సంఘాలు రుణాలు కూడా సకాలం లో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని కోరారు. రైతుల రుణమాఫీ కోసం ఎదురు చూడకుండా రెన్యువల్ కోవాలని ప్రకటనలో కోరారు.