మండలానికి మణి కిరీటం
ముత్యంపల్లి క్రీడామైదానం.
Scv News Kasipet :--
కాసిపేట మండలానికి ముత్యంపల్లి క్రీడామైదానం మణి కిరీటంలా నిలుస్తుంది. మండలంలోని క్రీడా అభిమానులకు ఆటలు ఆడుకు నేందుకు ప్రధాన వేదిక ముత్యంపల్లి క్రీడామైదానం. మైదానం ప్రారంభమైన గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజు ఎదో ఒక టోర్నమెంట్ నడుస్తూనే ఉంది. క్రీడామైదానం అభివృద్ధి వెనక సర్పంచి ఆడే బాదు, ఉప సర్పంచ్, బోయిన బాపు, ఎంపీటీసీ మండల వైస్ ఎంపీపీ విక్రమ్ రావు శ్రమ ఎంతో దాగిఉంది. వారు ఎంతో పట్టుదలతో, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేయడం వలన ఈ రోజు జిల్లాస్థాయి క్రీడా మైదానం ఏర్పడింది.
క్రీడామైదానం చరిత్రతెలుసుకుందాం..
ముత్యంపల్లి గ్రామ శివారులో స్థానిక వెలమ దొరలకు చెందిన ఆరు ఎకరాల భూమిని ప్రజా నాయకుడుగా పేరొందిన దివంగత మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు రఘుపతిరావు హాయంలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేశారు. స్థలంలో సుమారు రెండు వందల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇండ్ల స్థలాల పంపిణీ అనంతరం కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇళ్లస్థలాలు ఎలా పంపిణీ చేస్తారని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో పేదల ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. పదేళ్ల వరకూ స్థలము నిరుపయోగమైన పిచ్చి మొక్కలు మొలిచాయి. కొంత స్థలం కబ్జా కూడా గురైంది.
ఈ తరుణంలో నూతనంగా ఎంపికైన సర్పంచ్, ఉప సర్పంచి ఎంపీటీసీ లు భవిష్యత్ తరాలకు ఉపయోగ పడాలనే లక్ష్యంతో కొనుగోలు చేసిన స్థలాన్ని క్రీడా మైదానానికి ఇవ్వాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ద్వారా జిల్లా అధికారుల అంగీకారంతో క్రీడా మైదానానికి కేటాయించుకుని క్రీడా మైదానాన్ని సుందరంగా తీర్చి దిద్దడంలో క్రియాశీల పాత్ర పోషించారు. ప్రభుత్వం నిధులు,సింగరేణి యాజమాన్యం సహకారంతో మైదానం చుట్టూ ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేయడంతో రెండు గ్రామాల ప్రజలకు ఉదయం వాకింగ్ చేసుకోవడమే కాకుండా యువకులు ఉద్యోగాలు సాధించిన రన్నింగ్ ప్రాక్టీస్ కూడా మైదానం చాలా ఉపయోగపడుతుంది. వీటితో పాటు క్రీడా మైదానం అభివృద్ధి కావడంతో జిల్లా మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి తండ్రి పేరున దుర్గం రాజం స్మారక జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ తో పాటు, ఇతరులు కూడా వారి వారి బంధువుల పేరుతో స్మారక పోటీలు నిర్వహిస్తూనే ఉన్నారు. దసరా సందర్భంగా పెద్దఎత్తున రెండు గ్రామాల ప్రజలు బతుకమ్మ వేడుకలు ఫ్లడ్లైట్ల మధ్యలో అర్ధరాత్రి వరకు నిర్వహించుకున్నారు.
మండలంలో మొట్టమొదటి క్రీడా ప్రాంగణం ఈ మైదానంలోనే ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ప్రాంతంలోని యువకులకు క్రీడ నైపుణ్యం పెంపొందించుకోవాలనే లక్ష్యంతో ప్రారంభించిన క్రీడా ప్రాంగణం పథకం కాసిపేట మండలం లో మొట్టమొదట ముత్యం పల్లి మైదానంలోనే ప్రారంభమైంది. ఇటీవల క్రీడా ప్రాంగణాన్ని కూడా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. దీంతో మైదానంలో క్రికెట్ కాకుండా వాలీబాల్, షటిల్, కబడ్డీ లాంటి టోర్నమెంట్ ను కూడా నిర్వహించుకునే వీలు కలిగింది.
గతంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చిన మేరకు మైదానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే యువత కు వ్యాయామం ఫిట్నెస్ కొరకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ముత్యంపల్లి పంచాయతీలోని గ్రామాల అభివృద్ధికి క్రీడా మైదానం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచి బోయిన బాపు, ఎంపీటీసీ మండల వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ రావు లకు మండల ప్రజల తరఫున సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూప్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మండలంలోని మిగతా పంచాయతీల సర్పంచులు వీరిని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాం.



