కాసిపేట మండల కాంగ్రెస్
పార్టీ అధ్యక్షుడిగా వేముల
కృష్ణ .
- మండల కాంగ్రెస్ పార్టీకి
పూర్వవైభవం వచ్చే
అవకాశం ఉందని
కార్యకర్తల ధీమా!
Scv News Kasipet :--
కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ ను మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రకటించారు. వేముల కృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించ డం పట్ల మండల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వేముల కృష్ణ నాయకత్వంలో మండల కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ లో గత రెండు దశాబ్దాలుగా చురుకైన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీని ముందుకు తీసుకు వెళ్లడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మండలంలోని బడా కాంగ్రెస్ నాయకులంతా పార్టీ ఫిరాయించి టిఆర్ఎస్ లోకి వెళ్లారు. మండలంలో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్, లీడర్ లేని లోటు ఏర్పడింది. గత పంచాయతీ ఎన్నికల్లో వేముల కృష్ణ పెద్దనపల్లి సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందాడు.అధికార టీఆర్ఎస్ పార్టీ బడా నాయకులు వేముల కృష్ణ ను తెరాసలోకి చేర్చుకు నేందుకు ఎన్నో ఆశలు చూపి, ప్రలోభాలకు ప్రయత్నించిన క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా వారికి లొంగకుండా మండలంలో కాంగ్రెస్ పార్టీ కి పెద్దదిక్కుగా మారాడు.
మండలంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరుపున మండల సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీయడంలో ముందున్నాడు. కాంగ్రెస్ పార్టీకి అతను చేసిన సేవలను అధిష్ఠానవర్గం గుర్తించి వేముల కృష్ణకు మండల పార్టీ అధ్యక్షుడు పదవి కట్ట బెట్టడంతో మండలంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు ధీమాగా ఉన్నారు .
వేముల కృష్ణ రాజకీయ ప్రస్థానం ఇలా ఉంది.... 1998 కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం NSUI విద్యార్థి సంఘం లో చేరి మండల కార్యదర్శిగా 1999 లో స్వర్గీయ అప్పటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొక్కిరాల రఘుపతి రావు ఆశ్సిస్సులతో మండల శాఖ అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యలపై తెలుగుదేశం ప్రభుత్వం పై నిరంతరం పోరాటాలతో పరిష్కారానికి కృషి చేయడం జరిగింది.అప్పుడు మండలంలోని ఉపాధ్యాయులు NSUI కృష్ణ గా పేరు పెట్టి పిలిచేవారు.ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి,ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత యువజన కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.అప్పుడు విద్యార్థి,యువత పక్షాన నిలబడి ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు దగ్గర ఉండి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాని పెన్షన్ పథకం కింద లబ్ధిదారులకు అందించడం, విద్యార్థులకు గురుకుల పాఠశాలలో సీట్లు ఇప్పించడం, ప్రైవేటు పాఠశాలలో ఫీజులు మాఫి చేయంచడం లాంటి ఎన్నో కార్య క్రమాలు చేసాడు. యువతకి కార్పోరేషన్ ల ద్వారా బ్యాంకు లోన్ మంజూరు చేయంచడం లాంటి ఎన్నో పనులు చేసుకుంటూ 2013 లో ఎన్నికల ప్రక్రియలో భాగంగా యువజన కాంగ్రెస్ బెల్లంపల్లి నియెజకవర్గం ప్రధాన కార్యదర్శి ఎన్నిక కావడం అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకీ పనిచేస్తు కాంగ్రెస్ పార్టీ లో మండల, జిల్లా శాఖలలో పనిచేయడం జరిగింది. 2019 లో పెద్దనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా జనరల్ స్థానం నుంచి పోటీ చేసి అక్కడి ప్రజల మన్ననలు పొంది ఘన విజయం సాధించి పంచాయతీని ఒక ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దడం జరిగుతుంది.
మండల కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకు వస్తా....
-వేముల కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.
నా యొక్క పనితీరును గుర్తించి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధి నాయకత్వం మండల శాఖ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు జిల్లా పార్టీ అధ్యక్షురాలు సురేఖకు ఏఐసిసి సభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి మండల పార్టీ నాయకుల అందరికీ ప్రత్యేక ధన్య వాదములు. ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో పాలిస్తున్న దుర్మార్గాపు , నియంత పాలన పై కార్యకర్తల అండదండలతో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం కోసం నేను కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా పని చేస్తానని హామీ ఇస్తున్నాను. మండలంలోని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి అందరి సహాయ సహకారాలతో మండల సమస్యలపై పోరాటాలకు ప్రణాళిక సిద్ధం చేసి పోరాడుతామని మాట ఇస్తున్నాను .

