మల్కపల్లి ఆశ్రమ పాఠశాల
విద్యార్థి అంజన్నకు అరుదైన
గౌరవం.
Scv News Kasipet :--
తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ 2019 -20 లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన ఉన్నత పాఠశాల విద్యార్థి అంజన్నకు అరుదైన గౌరవం దక్కింది. టాప్ 60 లో నిలిచిన అయిదుగురు విద్యార్థులతో ఈరోజు టి. సాట్ 'నిపుణ ' ఛానల్ ద్వారా లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ లైవ్ ప్రోగ్రాంలో అంజన్న తోపాటు అతని గైడ్ టీచర్ వేములవాడ రమేష్ కూడా పాల్గొనడం జరిగింది. 'టీ.సాట్ ' కార్యక్రమంలో పాల్గొని మంచిర్యాల జిల్లాకు, గిరిజన సంక్షేమ శాఖకు మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
ఉపాధ్యాయ సిబ్బంది స్థాయి జిల్లా సైన్స్ అధికారి, జిల్లా విద్యాధికారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు అభినందించారు.


