మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కుటుంబ సభ్యుల వేధింపులకు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య

కుటుంబ సభ్యుల

వేధింపులకు తాళలేక

వృద్ధుడి ఆత్మహత్య.


Scv News Kasipeta :--

పితృ దినోత్సవ సందర్భంగా కొడుకుల వేధింపులు, హింసను తట్టుకోలేక తండ్రి ఉరివేసుకుని బలవన్మరణానికి గురయిన దారుణం ఉదంతమిది.

కాసిపేట మండలం ధర్మారావు పేట బెస్త వాడ గ్రామంలో తెల్లవారు జామున  కోరే భూమయ్య (55) అనే వృద్ధుడు ఇంటి సమీపంలోని వాగు ఒడ్డున చెట్టుకు ఉరివేసుకుని  బలవన్మరణానికి గురయ్యాడు. గ్రామస్తుల కథనం ప్రకారం కోరే భూమయ్యకు భార్య ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి ఉన్నారు. కుటుంబ పోషణ,కుమార్తె వివాహం కోసం 14 సంవత్సరాల దుబాయ్ వెళ్లి కూలి పనిచేస్తూ డబ్బులను ఇంటికి పంపేవాడు.పంపిన డబ్బులను కుటుంబ సభ్యులు పొదుపు చేయకుండా విచ్చలవిడిగా  ఖర్చు చేశారు. రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ నుండి వచ్చిన భూమయ్య డబ్బుల విషయం  అడగగా భార్య పిల్లలు సరిగా వివరాలు తెలుపక పోవడంతో   కుటుంబంలో వివాదం ప్రారంభమైంది. ఇటీవల అప్పులు చేసి వివాహం చేసాడు. ఇద్దరు  కొడుకులు ఎలాంటి పని చేయకుండా గ్రామంలో జులాయిగా తిరుగుతూ డబ్బుల కోసం తండ్రిని వేధింపులకు గురిచేస్తూ రెండు మూడుసార్లు కొట్టడం జరిగిందని గ్రామస్థులు తెలిపారు.భార్య కొడుకుల వేధింపుల తలలేక గత కొద్దిరోజులు సమీప బంధువుల ఇండ్లలో గడిపాడు. ఇటీవల కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం జరిగింది. అయినా కుటుంబ సభ్యుల వేధింపులు ఆగక పోవడంతో తాలలేక జీవితంపై విరక్తి చెంది రాత్రి ఇంటి నుండి వెళ్లి ఇంటి సమీపంలోని వాగు ఒడ్డునా చెట్టుకు ఉరివేస్కుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. దేవాపూర్ ఎస్ఐ విజేందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.