మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

ముత్యంపల్లి

లో  క్రీడాప్రాంగణాన్ని

ప్రారంభించిన ఎమ్మెల్యే

దుర్గం చిన్నయ్య.


Scv News Kasipet :---

 కాసిపేట మండలం ముత్యం పల్లి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభిం చారు.ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో  క్రీడామైదానాలు ప్రారంభించాలనే పథకం ద్వారా క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ గ్రామాలలో క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాడన్నారు . తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గ్రామాలలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుదన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్ పిటీసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావ్, సర్పంచ్ ఆడే బాదు, ఉప సర్పంచి బోయిని బాపు ఎంపీడీవో  అలీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, సర్పంచులు, ఎంపీటీసీ  లు తెరాస పార్టీ నాయకులు పాల్గొన్నారు.