మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలవాసి అభ్యుదయ కవి గొల్లపల్లి బ్రహ్మయ్య కు జిల్లా స్థాయి కవిసమ్మేళనంలో ప్రశంశ.

కాసిపేట మండలవాసి

అభ్యుదయ కవి గొల్లపల్లి

బ్రహ్మయ్య కు జిల్లా స్థాయి

కవిసమ్మేళనంలో ప్రశంశ.



Scv News Kasipet :--

 అభ్యుదయ, ఆధ్యాత్మిక భావాలతో కవితలను రాస్తూ ఇప్పుడిప్పుడే కవిగా  ప్రజలలో మంచి గుర్తింపు పొందుతున్న కాసిపేట మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి   బ్రహ్మయ్య కు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చింది. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కవి సమ్మేళన కార్యక్రమంలో  "తెలంగాణ స్ఫూర్తి" అనే అంశంపై బ్రహ్మయ్య వచన  కవితా పఠనం చేశాడు. కవిత అందరిని అలరించింది. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీమతి హోళీ కేరి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, రెండు వేల రూపాయల నగదు పుష్పగుచ్ఛము, శాలువాతో  సన్మానించడం జరిగింది. జిల్లాస్థాయి కవి సమ్మేళన కార్యక్రమంలో ప్రశంశలు అందుకున్న గొల్లపల్లి బ్రహ్మయ్య ను సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూప్,మండల సాహితీ అభిమానులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.

 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కవి సమ్మేళనం లో కాసిపేట మండల వాసి గొల్లపల్లి బ్రహ్మయ్య ఆలపించిన వచన కవిత్వం.


తెలంగాణ స్పూర్తి కవితాశీర్షిక-

మునుముందుకు సాగాలి

 దాశరథి చెప్పినట్లు నాతెలంగాణ

కోటిరతనాల సుస్వరాలవీణ నదీనదాలు

జలపాతాలతో హరితశోభాయమానమై

ప్రకృతి సహిత పవిత్రనేల

వివక్షకులోనై నీళ్ళునిధులు

నియామకాలనె

నినాదంతో ముందుకు సాగగ

మహామహులు మేధావులు

పూరించిన శంఖారావంతో

అమరవీరుల ప్రాణత్యాగాలతో

కవులు కళాకారులు కదం తొక్కి

సబ్బండవర్ణాలు ఏకమై

సమిష్టిపోరుతో సాధించుకున్న

నాసుందర తెలంగాణ సుశ్యామల

శోభితమై విలసిల్లాలి.

తెలంగాణబిడ్డలు సోదరభావంతో

స్నేహపూరిత వాతావరణంలో

 సుభిక్షంగా వుండాలి.

నా తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిచెంది

అగ్రగామియై ఆదర్శంగా నిలవాలి.

ప్రగతిపథంలో మును ముందుకుసాగాలి

బంగారుతెలంగాణగా వర్ధిల్లాలి.

         

 గొల్లపల్లి బ్రహ్మయ్యాచార్య