కాసిపేట 2 గనిలో 'స్వచ్ఛత పక్వాడా ' కార్యక్రమం ప్రారంభం.
Scv News Kasipet :---
మందమరి ఏరియా కాసిపేట 2 గని లో పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత స్వచ్ఛత పక్వాడా - 2022 కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. పదిహేను రోజులపాటు స్వచ్ఛందంగా ప్రజలు కార్మికులు తమ నివాసాలు పనిచేసే స్థలాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛత పక్వాడా కార్యక్రమం ద్వారా శ్రమదానం చేయాల్సి ఉంటుంది. కాసిపేట గని వద్ద ఈ కార్యక్రమాన్ని ఇంచార్జి గని మేనేజర్ సంతోష్ రావు ప్రారంభించారు. హెడ్ ఓవర్ మెన్ మైనోద్దీన్ స్వచ్ఛత పక్వాడా కార్మికుల చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కార్మిక సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

