తుడుం దెబ్బ ఆధ్వర్యంలో
గోండుగూడెం గిరిజనుల
ఆందోళన.
Scv News Kasipet :---
కాసిపేట మండలం పల్లెగూడెం పంచాయతీలోని గోండు గూడెం గ్రామ పరిధిలోని భూములు తమ పేరిట ఉన్నాయని గ్రామాన్ని ఖాళీ చేయాలని కొంతమంది బెదిరిస్తున్నారని గ్రామ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. వీరికి మద్దతుగా గిరిజన హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఊరేగింపుగా వచ్చి వినతి పత్రం అందజేశారు. గోండు గూడెం 1970 లో వెలసిందని గత 52 సంవత్సరాలుగా 20 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయని గిరిజనులు తెలిపారు. ఇటీవల కొంతమంది వచ్చి గ్రామం కింద ఉన్నా భూములన్నీ తమ పేరిట ఉన్నాయని గ్రామం ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని తెలిపారు. గ్రామం ఖాళీ చేయకుంటే బుల్డోజర్ లతో కూల గోడతామని బెదిరిస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు మద్దతుగా తుడుందెబ్బ నాయకులు గ్రామస్థులతో ఊరేగింపుగా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో గ్రామాన్ని ఖాళీ చేయమని తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి దుస్స విజయ చంద్, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు ఆడ జంగు, జిల్లా నాయకులు అనంత రావు, హనుమంతు, మండలాధ్యక్షుడు ఆత్రం జంగు, ప్రధాన కార్యదర్శి మడావి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
