కాసిపేట మండలంలోని
గిరిజన గ్రామాలను
సందర్శించిన మాజీ ఎంపీ
మీనాక్షి నటరాజన్.
Scv News Kasipet :---
కాసిపేట మండలంలోని సోనాపూర్, గట్రావుపల్లి పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం,గట్రావుపల్లి,రేగులగూడ,తుడంగూడ, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజి యం,పి, ప్రస్తుత రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన జాతీయ అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ పర్యటించారు. గిరిజన గ్రామాలను సందర్శించి అక్కడి గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకు న్నారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని గిరిజను ల ద్వారా తెలుసుకున్నారు. ధరణి లోని భూ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలిపారు. పోడు భూములకు సంబంధించిన సమస్యల్ని స్థానిక గిరిజనులు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువచ్చారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఉండి కూడా మా గ్రామాలకు ఎలాంటి నిరుద్యోగులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని అలాగే కంపెనీ చుట్టూ ప్రక్కల గ్రామాలకు ఎలాంటి మౌళిక సదుపాయాలు కల్పించడం లేదని గిరిజనులు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి కంపెనీ లాభాలలో 30 % నిధులు కెటాయిం చాలని అలాగే గ్రామ సభల ఆమోదం లేకుండా, మరియు గిరిజన చట్టాలను ఉల్లంఘించరాదని, అన్ని గ్రామలు ఐక్యతతో ఈ ప్రభుత్వాలపై హక్కుల కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. గిరిజన గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న వారి సమస్యలను నోట్ చేసుకోవడం జరిగింది. గిరిజన కట్టుబాట్లు ఆచారాలు సంప్రదాయాలను తెలుసు కోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్ వెంట మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీమతి కొక్కిరాల సురేఖ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, దేవాపూర్ యంపిటిసి మెరుగు పద్మ -శంకర్, ధర్మారావు పేట ఎంపీటీసీ పార్వతి మల్లేష్, ఓరియంట్ సిమెంట్ కంపెనీ కాంట్రాక్టు కార్మిక నాయకులు అన్నం కుమార్, మల్కపల్లి మాజి సర్పంచ్ ప్రభాత్ రావు,ఛిత్రు, స్థానిక గిరిజన నాయకులు పాల్గొన్నారు.


