దేవాపూర్ మేజర్
పంచాయతీలో తాగునీటికి
తల్లడిల్లుతున్న వడ్డెర
కాలనీవాసులు.
![]() |
| చెడిపోయిన బోర్వెల్ చూపిస్తున్న వడ్డెర కాలనీవాసులు. |
![]() |
| వడ్డెర కాలనీ వాసులు తాగునీటి సమస్యలు తెలుసుకుంటున్న బీజేపి నాయకుడు అట్కాపురం రమేష్. |
Scv News Kasipet :-
కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీవాసులు తాగు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. ఎండాకాలంలో ఎండల తీవ్రత పెరిగి తాగునీరు లేక తమ కుటుంబాలను తీవ్ర అవస్థలు ఫాలో అవుతున్న పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా వీధిలో ఉన్న ఒకే ఒక్క బోర్ వెల్ చెడిపోవడంతో తాగునీటి కోసం కిలో మీటర్ దూరంలో ఉన్న రోడ్డు వైపు వెళ్లాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్న తమ గ్రామానికి నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డెర కాలనీ వాసులకు తాగునీరు అందించేందుకు గ్రామపంచాయతీ సర్పంచ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బీజేపీ కిసాన్మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్కాపురం రమేష్ డిమాండ్ చేశారు. రమేష్ బుధవారం వడ్డెర కాలని సందర్శించి వారి తాగునీటి అవస్థలను తెలుసుకున్నాడు. చెడి పోయిన బోర్వెల్ పరిశీలించాడు. బోర్ వెల్ మరమ్మతులను వెంటనే చేపట్టాలని రెండు రోజుల్లో తాగునీటి సమస్య పరిష్కరించ కుంటే కాలనీ వాసులతో పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

