మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

 ప్రజ ఉద్యమాల

బలోపేతానికై జూన్ 15న

సిపిఎం పార్టీ  విస్తృత స్థాయి

సమావేశం.

Scv News Kasipet :---

మంచిర్యాల,కొమురం భీం జిల్లాల ఉమ్మడి విస్తృతస్థాయి సమావేశం.  జూన్ 15 న బెల్లంపల్లిలో నిర్వహించడం జరుగు తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారి రవి కుమార్ తెలిపారు. గురువారం కాసిపేట మండలం ట్యాంక్ బస్తిలో సిపిఎం పార్టీ జిల్లాస్థాయి నాయకుల సమా వేశంలో వెల్లడిం చారు.జిల్లా స్థాయి  విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు అవుతున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో  మంచిర్యాల, కొమురం భీం జిల్లాలలో ప్రజలేదుర్కొం టున్న సమస్యలు,వాటి పరిష్కారానికై చెయ్యబోయే పోరాటాలను రూపకల్పన చెయ్యడం జరుగు తుందని వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో ఆదివాసీలు, పేదలు,కార్మికులు,రైతులేదుర్కొంటున్న సమస్యల CPM పోరాటా లు  చెయ్యడం జరిగిందని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, ఫారెస్ట్ శాఖ ద్వారా జన్నారం,దండేపల్లి  మండలల్లో ఆదివాసీ,పేదలపై  తీవ్ర నిర్బంధాలు ప్రయోగిస్తూ,అక్రమ  కేసులు పెట్టీ 12 మంది మహిళ లను  జైలుకు పంపించడం జరిగిందని విమర్శించారు.

BJP మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్,నిత్వావసర సరుకుల ధరలను పెంచి ప్రజలపై భారులు వేస్తే, KCR ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచింది BJP దారిలో ప్రయాణం చేస్తుందని ఆరోపించారు.నేడు ప్రజలు నూనె ప్యాకెట్,టమాటా కొనలేని దుస్తితి వచ్చిందని,డబుల్ బెడ్ రూం ఇండ్లు జాడలేదni, అర్హులైనవారి పెన్షన్లు మంజూరు చెయ్యడం లేదని విమర్శించారు . జిల్లాలో అనేక సమస్యలు రాజ్యమేలు తున్న  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిష్కరించడం లేదని పై సమస్యల పరిష్కారానికి జిల్లాలో చెయ్యబోయే పోరాటాలను రూపొందించు కోవడం జరుగుతుందని తెలిపారు.ఈ విస్తృత స్థాయి సమావేశానికి మంచిర్యాల,కొమురం భీం జిల్లాల నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరు కావడం జరుగుతుందని వెల్లడించారు.

ఈ సమావేశంలో CPM సంకే రవి జిల్లా కార్యదర్శి,జిల్లా కమిటీ  సభ్యులు దూలం శ్రీనివాస్, దాగం రాజారాం,D. రంజిత్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.