ఆదివాసి,పేదలపై ఫారెస్ట్
అధికారుల దాడులు,
దౌర్జన్యాలు,అక్రమ కేసులు
నిలిపివేయాలి.
- వెలమ భూస్వాములు
పేదల సీలింగ్ భూములను
గుంజుకోని అమ్ముకోవడం
నిలిపివేయాలి.
- సంకె రవి సిపిఎం
మంచిర్యాల జిల్లా కార్యదర్శి.
Scv News Kasipet :--తెలంగాణ అదివాసీ గిరిజన సంఘం(TAGS) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) మంచిర్యాల జిల్లా కమిటీలిచ్చిన జూన్ 27 ఛలో మంచిర్యాల కలెక్టరేట్ కు మద్దతు గా మంగళవారం కాసిపేట మండలంలోని పెద్దనపల్లి, వరిపేట,బుగ్గ గూడెం, తంగల్లపల్లి,నాయకపు గూడెం,తాండూర్ మండలంలోని కర్షల ఘట్టు గ్రామాల్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకే రవి ఆధ్వర్యంలో ప్రచారం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా సంకే రవి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఫారెస్ట్ శాఖ దౌర్జన్యాలకు హాద్దు అదుపు లేకుండా పోయిందని నిరు పేద రైతులు తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్నా భూములను ఫారెస్ట్ శాఖ అధికారులు దౌర్జన్యంగా గుంజుకొని ఫారెస్ట్ లో కలపడం జరుగుతుందని తెలిపారు. 2006 అటవీ హక్కుల చట్టం అమలుకు నోచుకోవడం లేదని,పట్టా పాసు పుస్తకాలున్న భూములను కూడ సాగు చేసుకొనివ్వడం లేదని విమర్శించారు .మరోప్రక్క ప్రభుత్వాధికారుల అండతోని మండలంలోని వెలమ దొరలు, భూస్వా ముల వారసులు పేదల చేతుల్లో ఉన్న సీలింగ్ భూములను గుంజుకొని అమ్ముకోవడం జరుగుతుందని ఈ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీలకు,పేదలకు భూములు లేకుండ చెయ్యడమే ఫారెస్ట్ శాఖ, భూస్వాముల వారసుల లక్ష్యం అన్నట్లుగా వ్యవరిస్తు న్నారని వారి పద్ధతులు మార్చుకోవాలని లేకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నిరుపేదలకు ఇచ్చిన వాగ్దానాలు డబుల్ బెడ్ రూం ఇండ్లు, పెన్షన్ల జాడ లేకుండా పోయిందని విమర్శించారు. పోడు భూముల,సీలింగ్ భూముల రక్షణ కై జూన్ 27 న ఛలో మంచిర్యాల కలెక్టరేట్ కు పెద్ద ఎత్తున తరలిరావాలని మండల ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు జంగుబాయి,శంకర్ పాల్గొన్నారు.

