కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల
నిరంకుశ పాలనకు
వ్యతిరేకంగా ప్రజా
ఉద్యమాలను ఉధృతం
చేస్తాం.
- కలవేని శంకర్ సిపిఐ రాష్ట్ర
కార్యవర్గ సభ్యుడు.
Scv News Kasipeta:---
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్ అన్నారు. శుక్రవారం కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో జరిగిన మండల సిపిఐ మహాసభ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాసిపేట మండలంలో ఒకవైపు సింగరేణి, మరోవైపు భారీ సిమెంట్ కర్మాగారం ఉన్న మండలంలోని గ్రామాలు అభివృద్ధి చెందడంలేదని,నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని విమర్శించా రు.గిరిజనులపై అటవీ అధికారుల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సంవత్సరాలు గా పోడు వ్యవసాయం చేసుకుంటున్నా గిరిజన భూముల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటడం భావ్యం కాదన్నారు.
బెల్లంపల్లి నియోజక వర్గ ఇన్చార్జి రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ పన్నెండు వందల ఉద్యమకారుల బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించా రు.విద్య, వైద్యం,పేద ప్రజలకు అందడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన అద్వాన్నంగా మారిందని తెలంగాణ అభివృద్ధి కంటే వాళ్ల కుటుం బాల ఆస్తులు పెంచుకోవడం కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మూడెకరాల భూమి,దళిత బందు పథకం ఇవ్వడం లేదని విమర్శించారు. హరిత హారం పేరిట గిరిజనులు సాగుచేసుకుంటు న్న పోడు భూముల గుంజుకుంటున్నారని, అడ్డుకుంటే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నా రని విమర్శించారు.
రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామడుగు లక్ష్మణ్ మాట్లాడు తూ తెలంగాణ సమైక్యాంద్ర పాలనలో నీళ్లు నిధులు నియామకాలు లేక తీవ్రంగా నష్ట పోయిందని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ ప్రజలకు వచ్చిన లాభం ఏమీ లేదని విమర్శించారు. తెలంగాణలో దోపిడీ,నియంతపాలన సాగుతోందని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల కెసిఆర్ కుటుంబం బాగు పడిందని వేల కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నారని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అప్పులు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించా రని ఆరోపించారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు చిప్ప నర్సయ్య మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల పార్టీ అని ప్రజల కోసం తమ రక్తాన్ని చిందించి ఎందరో వీరులు అమరులయ్యా రన్నారు. కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు,ఉద్యమాల వల్లనే కార్మికులు, ప్రజలు తలెత్తుకొని బతుకుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఆస్తులను ప్రైవేటు వారికి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పారిశ్రామికవేత్త ఆదానికి దేశాన్ని విక్రయించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులతో దేశం దివాలా తీసి అన్ని వస్తువులపై అధిక ధరలు మోపి పేద ప్రజల బతకలేని పరిస్థితి తెచ్చాయని విమర్శించారు. ప్రజలంతా భారత కమ్యూనిస్టు పార్టీ వెంట ఉండి ఉద్యమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మండల సిపిఐ కార్యదర్శి దాగం అధ్యక్షత వహించారు.
సమావేశానికి ముందు సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రేగుంట చంద్రశేఖర్ ఎర్ర జెండాను ఎగరవేశారు. మండల కార్యదర్శి దాగం మల్లేష్ మండల పార్టీ కార్యక్రమాలను వివరించారు. తర్వాత మండల సభను ప్రారంభించారు. సమావేశం అనంతరం కాసిపేట మండలం నూతన కమిటీ కౌన్సిల్ లో 21మంది 9 మంది కార్యవర్గ సభ్యులతో మండల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
మండల కమిటీ కార్యదర్శిగా మరోసారి దాగం మల్లేష్ ఏకగ్రీవంగా ఎన్నిక.మండల సిపిఐ మహాసభ తర్వాత మండల కమిటీ మరోసారి మండల సిపిఐ కార్యదర్శి దాగం మల్లేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
ఈ సందర్భంగా దాగం మల్లేష్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో సిపిఐ పార్టీ ని విస్తరించేందుకు సాయశక్తులా కృషి చేస్తానన్నారు. ప్రజాసమస్యలపై,గిరిజనుల సమస్యలపై ఉద్యమాలు చేపడతామని అన్నారు.
సహాయ కార్యదర్శి గా గట్టు సర్వేశం, ప్రచార కార్యదర్శి గా గోనా సత్యం, కోశాధికారిగా పులి శంకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిపిఐ మండల మహాసభలో మండల నాయకులు జాడి పోశం,దాడి గట్టయ్య దుర్గం సుధాకర్, బండారి సత్తయ్య ,
దాగం రాజలింగు,తాండూరు మండల కార్యదర్శి కొండ గణేష్ ఉప్పులేటి మధునయ్య, తిరుమల మోషన్ తో పాటు వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు.






