మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకం బీమా సొమ్ము అందజేత.

 ప్రధానమంత్రి జీవనజ్యోతి

బీమా యోజన పథకం బీమా

సొమ్ము  అందజేత.

Scv News Kasipet:---

 కాసిపేట మండలం ముత్యం పల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో బుధవారం ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం కింద మంజూరైన రెండు లక్షల బీమా సొమ్మును బాధితురాలు మారం సరితకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక మేనేజర్ రాజేష్ ప్రసాద్ అందజేశారు. సరిత భర్త మారం బాపు కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా  యోజన పథకం కింద బీమా చేశారు. బాపు ఇటీవల  అనారోగ్యం వల్ల చనిపోయాడు. నామిని గా ఉన్న సరితకు బీమా సొమ్ము రెండు లక్షల రూపాయలను బ్యాంకు అధికారులు అందజేయడం జరిగింది.

 మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న బ్యాంకు ఖాతాదారులు ప్రధానమంత్రి జీవనజ్యోతి  బీమా యోజన పథకం లో చేరాలని బ్యాంక్ అధికారులు కోరారు.