మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాసిపేట2వ గనిపై ధర్నా

 ఏఐటీయూసీ ఆధ్వర్యంలో

కాసిపేట2వ గనిపై ధర్నా


Scv News Kasipet :---

 మందమర్రి ఏరియా కాసిపేట2వ  గనిపై సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో మంగళవారం మొదటి షిఫ్ట్ లో గేట్ మీటింగ్ నిర్వహించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  కార్మికులను ఉద్దేశించి బెల్లంపల్లి బ్రాంచ్ ఇంచార్జ్  చిప్ప నర్సయ్య మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారం లో  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గుర్తింపు యూనియన్ నాయకులు కార్మికుల హక్కులు సమస్యలపై మాట్లాడకుండా పైరవీల కే పరిమితమయ్యారని విమర్శించారు.  ధర్నా అనంతరం బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్  కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించా లని సమస్యలతో కూడిన మెమోరాండం గని మేనేజర్  రవిందర్ కు అందజేశారు. కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కారం చేయాలని మెమోరండం అందజేసారు.

 *190 మాస్టర్లు నిండిన బదిలీ వర్కర్స్ అందరికీ జనరల్ మజ్దూర్ ఇవ్వాలి.

 * సర్ఫేస్ జనరల్ మజ్దూర్ పోస్టులకు అన్ని కేటగిరి వారికి అవకాశం కలిగించాలి.

*  క్వాటర్స్ లేని కార్మికులందరికీ  ఇంటి కిరాయి (HRA) చెల్లించాలి.

 *  సింగరేణిలో 850  క్లరికల్(జూనియర్ అసిస్టెంట్)  పోస్టులకు 150 ఇంటర్నల్ పోస్టులు ఖాలిలు కాకుండా 850 పోస్టులకు  ఇంటర్నల్ వారిచే ఖాళీలను భర్తీ చేయాలి.

 * కొల్ ఇండియా తరహాలో కొత్తగా అపాయింట్మెంట్ అయిన వారికి బదిలీ వర్కర్ కాకుండా జనరల్ మజ్దూర్ గా అపాయింట్మెంట్ చేయాలి.

*   కార్మికులకు సొంత ఇంటి పథకం కింద మిగులు క్వాటర్లు కేటాయించాలి లేదా  300 గజాల స్థలం ఇచ్చి 20 లక్షలు రూపాయలు రుణ సౌకర్యం కల్పించాలి.

* జూన్ 2 PHD (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా) సింగరేణి ఉద్యోగులకు సెలవును ప్రకటించాలని మెమోరండం ద్వారా కోరారు.

 ఈ సమావేశము అధ్యక్షులు  పిల్లి వేంకటేశ్వర్లు పిట్ కార్యదర్శి పులి శంకర్, కొత్తపెళ్లి నరసయ్య, తీర్థాల చంద్రయ్య, రాజ్ కొమురయ్య, గొదర్ల లింగమూర్తి కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు.