మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అభివృద్ధి పథంలో ముత్యంపల్లి పంచాయతీ.



Scv News Kasipet :--

 కాసిపేట మండలం ముత్యంపల్లి పంచాయతీలోని గ్రామాలలో అభివృద్ధి పనులకోసం గత మూడేళ్ల కాలంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా సుమారు 5.22 కోట్ల ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.ఈ నిధులతో పంచాయతీ పరిధిలోని దుబ్బగూడెం, గురువాపూర్,గుండ్లపహాడ్,ముత్యంపల్లి గ్రామాలలో అంతర్గత సిమెంట్ రహదారు లు మురికి కాలువలు,వాగులపై వంతెన, ఆరోగ్యకేంద్రం,రైతువేదిక,పల్లెపకృతి వనం తదితర అభివృద్ధి పనులకు వ్యయం చేశారు.గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉపసర్పంచ్ లు సమన్వయంతో వివాదాలు లేకుండా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడంతో  నిధులు వృథా కాకుండా సద్వినియోగమై పంచాయతీ అభివృద్ధి పథంలో పయనిస్తుంది.ఇంకా గ్రామాలలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రెండేళ్ల పదవీ కాలంలో నిధులు మంజూరు అయితే ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని సర్పంచ్, ఉప సర్పంచ్ లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గత మూడేళ్ల కాలంలో పంచాయితీకి వివిధ పథకాల ద్వారా వచ్చిన నిధుల వివరాలు వాటితో చేపట్టిన పనులు ఇలా ఉన్నాయి...

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం Nrgs కింద 2020/ 21లో 24 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. వీటితో


*గుండ్లపహాడ్ గ్రామంలో 10 లక్షలు, దుబ్బగూడెం గ్రామంలో 5 లక్షలతో సిమెంట్ రహదారులు నిర్మించారు. 

*21/22లో విడుదలైన 4 లక్షల నిధులతో  కురుమ నర్సయ్య ఇంటి నుండి దురుసేటి నందం ఇంటి వరకు సిమెంటు రోడ్డు నిర్మాణం చేశారు.

*పల్లె పకృతి వనంలో 5 లక్షలతో అభివృద్ధి పనులు నిర్వహించారు.

జిల్లా ఖనిజాభివృద్ధి నిధులు Dmft కింద  2020 /21కింద 62 లక్షల నిధులు మంజూరు అయ్యాయి.


ముత్యంపల్లి ప్రజలను ఎన్నో రోజులుగా అవస్థలకు గురిచేస్తూన్న ప్రధాన రహదారి మరమ్మతు చేసి ముత్యంపల్లి బస్టాండ్ హనుమాన్ టెంపుల్ వరకు 35 లక్షలతో బిటి రహదారి నిర్మాణం చేశారు. *ముత్యంపల్లి ఆటోస్టాండ్ నుండి దారవేణి రాజయ్య, పాలవేని రాజు ఇంటి వరకు 15 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసారు.

*ఎస్సీ కాలనీలో 5 లక్షలతో మురికి కాలువల నిర్మాణం.

* 21/22 సంవత్సరంలో విడుదలైన Dmft నిధులు7లక్షలతో రౌతు సత్తయ్య వాడలో కల్వర్టు సిసి రోడ్ నిర్మాణం చేశారు.

*2 లక్షల నిధులతో దుబ్బగూడెం,ముత్యం పల్లి ఎగ్గే శంకర్ ఇంటి ముందు హైమాస్ లైట్లు ఏర్పాటు చేశారు.

*జెడ్ పి టి సి 5 లక్షల నిధులతో గురువాపూర్ లో సిమెంటు రోడ్డు నిర్మాణం చేసారు.

*మండల పరిషత్ నిధులు 4.20 లక్షలతో సిలార్ ఖాన్ వీధిలో  మురికి కాలువల నిర్మాణం చేశారు.

1.33 కోట్ల నిధులతో ఆరోగ్య కేంద్రం' రైతు వేదిక నిర్మాణం


మండల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముత్యంపల్లి గ్రామంలో 1.5 కోట్ల నిధులతో నూతన ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం.

 *మండల రైతాంగానికి వ్యవసాయ సూచనలు అందించేందుకు 28 లక్షలతో రైతు వేదిక నిర్మాణం.

గ్రామపంచాయతీ  13 లక్షల నిధులతో.. 


సిమెంటు రహదారులు మురుగు కాలువ లను నిర్మించారు.

*2 లక్షల నిధులతో హనుమాన్ టెంపుల్ వద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణం.

*3 లక్షలతో  గుండ్ల పహాడ్ గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం.

*ముత్యంపల్లి గ్రామంలో దురిశెట్టి నందం ఇంటి నుండి నాయిని బుచ్చమ్మ ఇంటి వరకు 3 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం. 

* లంక లక్ష్మన్ వీధిలో 1.8 లక్షల నిధులతో మురికి కాలువల నిర్మాణం.గిన్నె సతీష్ వీధిలో 1 లక్ష  రూపాయల నిధులతో  మురికి కాలువల నిర్మాణం. మల్లెతుల సందీప్, పొన్నవేణి గంగ, కోళ్ల రాయమల్లు ఇండ్ల వద్ద 2.1 లక్షలతో  మురికి  కాల్వల నిర్మాణం.

గురువాపూర్ గిరిజనుల దశాబ్దాల కల సాకారం.సల్పల వాగుపై వంతెన 3.5 కోట్ల నిధులతో  నిర్మాణం చేస్తున్న  గురువాపూర్ వంతెన.


దశాబ్దాలుగా  పంచాయతీలోని గురువాపూర్ గిరిజనులు వర్షాకాలం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి నానాఅవస్థలు పడేవారు. గ్రామ ప్రజలకు ఏ సదుపాయం కావాలన్న వాగు దాటి రావాల్సిందే.సలుపల వాగు దాటి  పంచాయతీ కార్యాలయానికి, మండల కేంద్రానికి రావాలంటే ఎన్నో అవస్థలు పడే వారు.నిత్యవసర వస్తువులు, రేషన్ బియ్యం పింఛన్ తీసుకోవాలన్న నరకయాతన అనుభవించే వారు. వర్షాకాలంలో అత్యవసర సమయంలో గురువాపూర్ గిరిజనులు వాగు దాటి వస్తున్న క్రమంలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గ్రామ ప్రధాన సమస్య అయిన సలపలవాగు పై వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లోనూ వివిధ పార్టీ ల నాయకులకు విన్నవిస్తూనే వున్నారు. ఎట్టకేలకు ఇటీవల తెరాస ప్రభుత్వం వంతెన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ముత్యం పల్లి నుండి చింతగూడెం వరకు బి.టి  రహదారి వంతెనల నిర్మాణం కోసం  ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద ఎనిమిది కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. వాటి నుండి గురువాపూర్ ప్రజల సౌకర్యం కోసం సలుపల వాగుపై మూడున్నర కోట్ల నిధులతో వంతెన నిర్మాణం ప్రారంభమై శరవేగంగా నడుస్తుంది.

 గత మూడు సంవత్సరాలుగా మండలంలోని మిగతా  పంచాయితీల కంటే ఎక్కువ నిధులు వచ్చి గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తుండటంతో  పంచాయతీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.