దేవాపూర్ ఏజెన్సీ గ్రామంలో
ప్రభుత్వ భూమి కబ్జాపై
ప్రజావాణిలో ఫిర్యాదు.
Scv News Kasipet :--
కాసిపేట మండలం దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలోని సర్వే నెంబర్ 84 లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజనేతరులు కబ్జా చేశారని సోమవారం ప్రజావాణి లో నాయక్ పోడ్ సేవా సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని నిరుపేద గిరిజనులకు పంచాలని ఎన్నో ఉద్యమాలు చేసి, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని నాయకులు తెలిపారు. గిరిజనేతరులు కబ్జా చేసుకోగా 10 గుంటల భూమి మాత్రమే మిగిలిందని తెలిపారు. తమ సంఘ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు కనీసం ఆ భూమి నైనా నాయక్ పోడ్ సేవా సంఘ భవన నిర్మాణానికి అయిన ఒప్ప చెప్పాలని అధికారులను కోరారు.
ప్రజావాణిలో ఎంపీడీవో కు వినతి పత్రం అందజేసిన వారిలో నాయక్ పోడ్ సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, మండల ప్రధాన కార్యదర్శి మెండ్రపు రాజన్నలు ఉన్నారు.
