మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మరో పేద యువతి పెళ్లికి కళ్యాణ కానుక అందించిన పెద్దనపెల్లి సర్పంచి వేముల కృష్ణ

 మరో  పేద యువతి పెళ్లికి

కళ్యాణ కానుక అందించిన 

పెద్దనపెల్లి సర్పంచి వేముల

కృష్ణ.




Scv News Kasipet

కాసిపేట మండలంలోని పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ణ పేద యువతి పెళ్లికి కళ్యాణి కానుక  5,116, చీరే,సారె అందించి అండగా నిలిచాడు. పెద్దనపల్లి  పంచాయితీలోని నాయకపూ గూడెం కు   చెందిన చండీ మైసక్క- మల్లయ్య  కుమార్తె నాగలక్ష్మి వివాహానికి సర్పంచి వేముల కృష్ణ దంపతులు బుధవారం  కళ్యాణ కానుక అందజేసి పెళ్లి కుమార్తె ను ఆశీర్వదించారు. వేముల కృష్ణ తన మూడేళ్ల పదవీ కాలంలో ఆరుగురు  పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సహాయం అందజేసి మండల సర్పంచులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్  సోమని మైసక్క, వార్డు సభ్యులు కొత్త రమేష్, నాయకులు కూకట్ల దేవెందర్, పంబాల తిరుపతి, సోమని రాజం ,  భూనేని రాజం వీర వేణి శ్రీనివాస్, రషీద్, నవీన్  తదితరులు పాల్గొన్నారు.