మానవతా మూర్తి
పల్లంగూడెం సర్పంచ్ దుస్స
విజయ మరో నిరుపేద
కుటుంబానికి ఆర్థిక
సహాయం.
Scv News Kasipet :--
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచినప్పటి నుండి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వివాహ సమయాల్లో ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు పల్లం గూడెం సర్పంచ్ దుస్స విజయ చందు లు. శనివారం పంచాయితీలో నిరుపేద చెన్న వేణి భూమక్క, శంకర్ యాదవ్ కుమార్తె మమత వివాహానికి పుస్తే, మట్టెలు, కొత్తబట్టలు,పది వేల రూపాయల నగదు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
పెళ్లి సమయంలో నిరుపేద కుటుంబాలకు మండలంలో ఏ సర్పంచ్ కూడా చేయలేని రీతిలో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలలో వెలుగులు నింపుతున్న మానవతామూర్తి మనసున్న మహారాణి సర్పంచ్ దుస్స విజయ చందులు.తన మూడేళ్ల పదవీ కాలంలో ఇప్పటివరకు తన గ్రామ పంచాయతీలో 12మంది కుటుంబాలకు లక్షా 20 వేల ఆర్థిక సహాయం తో పాటు మరో లక్ష రూపాయల విలువగల మట్టెలు, మంగళ సూత్రం, కొత్తబట్టలు వస్తువులను అందజేశారు.పంచాయితీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు వివాహ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేస్తూ మంచిర్యాల జిల్లా కే ఆదర్శంగా నిలుస్తున్నా రు. మండలంలో 22 పంచాయితీలు ఉన్నాయి. వీటిలో పల్లంగూడెం, పెద్దనపెళ్లి సర్పంచులు మాత్రమే పంచాయతీ పరిధిలోని పేదలకు పెళ్లి ఖర్చు కోసం ఆర్థిక సహాయం చేస్తున్నారు. మిగతా పంచాయ తీల్లో సర్పంచులు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని పేద కుటుంబాలకు సహాయం అందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
