నిరుద్యోగులకు ఉపాధి
అవకాశాలు కల్పిస్తున్నా
టి జి బి బ్యాంక్. నిరుపేద
కుటుంబాల లో ఆనందం.
Scv News Kasipet :--
గ్రామీణ ప్రాంతాలలోఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబాలను పోషించుకో లేని నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు రుణాలు అందిస్తూ ప్రోత్స హించడం నిరుపేద కుటుంబాల లో ఆనందం వెల్లివిరుస్తుంది. బ్యాంకు అధికారులు ఇచ్చిన రుణ సదుపాయాల తో నిరుద్యోగ యువత వాహనాలను దుకాణాలను పెట్టుకొని స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషిం చుకోవడం వారి కుటుంబాలను ఆనందం నింపుతోంది.కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన చొప్పదండి సంజీవ్ కుమార్ నిరుద్యోగ యువకుడికి ఉపాధి కోసం శుక్రవారం టాటా వాహనాన్ని మంచిర్యాల జిల్లా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారి హరగోపాల్ అంద జేశారు. బ్యాంకు రుణం రూ. 5,22,000/- బ్యాంకు సబ్సిడీ 30,000/- ఇచ్చింది. ఈ కార్యక్రమం లో ముత్యంపల్లి బ్యాంకు మేనేజర్ రాజేష్ ప్రసాద్, ఫీల్డ్ ఆఫీసర్ ఆశిష్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
