నాగరాజు హత్యకు
నిరసనగా దేవాపూర్ లో
మాదిగ మహారాజు ల ధర్నా
Scv News Kasipet :---
హైదరాబాద్ సరూర్ నగర్ లో మతాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు నాగరాజును అమ్మాయి బంధువులు హత్య చేసినందుకు నిరసనగా ఆదివారం కాసిపేట మండలం దేవపూర్ గ్రామంలో మాదిగ మహారాజులు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. నాగరాజు హత్యచేసిన నిందితులను ఉరి తీయాలని వారి కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రోడ్డు మీద నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా కఠినంగా శిక్షించాలని మాదిగ మహారాజులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆట కాపురం రమేష్. దుర్గయ్య.పెద్ద నరసయ్య. వెంకటేష్.ప్రవీణ్. దిలీప్. లక్ష్మణ్. సతీష్. జులా మల్లేష్. తదితరులు పాల్గొన్నారు.
