మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పెద్దనపల్లి నాయక గూడలో ఊరు పోచమ్మ కు పూజలు.

 పెద్దనపల్లి నాయక గూడలో

ఊరు పోచమ్మ కు పూజలు.


Scv News Kasipet :--

 కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దనపల్లి నాయకపుగూడెం గ్రామంలో ఈరోజు  ఊరు పోచమ్మ కు గ్రామంలోని మహిళలు పూజలు చేశారు. ఊరిలో ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలని గ్రామం  సుభిక్షంగా ఉండాలని, పంటలు మంచిగా పండాలని కోరుతూ మహిళలు పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి ఒక మహిళ బిందెడు నీళ్లను తీసుకెళ్లి పోచమ్మ విగ్రహాన్ని కడిగి పూజలు నిర్వహించారు. ప్రతి వర్షాకాలం ముందు సంప్రదాయబద్దంగా పూజలు చేయడం తమకు అలవాటని గ్రామ ఉపసర్పంచ్ సోమని మైసక్క  తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘ సభ్యులు పల్లె రజిత, సోమని విజయలక్ష్మి,రాజులు తదితరులు పాల్గొన్నారు.