పెట్రోల్ ధరలు తగ్గించి
నందుకు మోడీ చిత్రపటానికి
పాలాభిషేకం.
Scv News Kasipet :--
కాసిపేట మండల కేంద్రంలో ఆదివారం భారతీయ జనతాపార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సూరo సంపత్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దృష్యా ఈరోజు పెట్రోల్ 9.50 రూపాయలు మరియు డీజిల్ 7 రూపాయలు తగ్గించడం జరిగిందన్నారు.వంట గ్యాస్ పైన 200 రూపాయలు సబ్సిడీ ఇస్తుందన్నారు . భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆనందని వ్యక్తం చేస్తున్నారు.ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ లో ఉన్నటువంటి ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ 10 నుండి 15 రూపాయలు తగ్గించాలి అని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పీడిస్తూ పరిపాలన చేస్తుంది తెలంగాణ ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు విద్యుత్ మద్యం చార్జీలు పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం
మరియు తెలంగాణలో రైతు చనిపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రైతులను పట్టించుకోకుండాఇతర పంజాబ్ రాష్ట్రాల్లో మూడు లక్షలు ఇవ్వడం చాలా బాధాకర విషయం తక్షణమే రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా యువ మోర్చా తరపున డిమాండ్ చేస్తున్నాం...
ఈ కార్యక్రమంలో కిసాన్మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అటక పురం రమేష్ ,బిజెపి ముత్యం పల్లి గ్రామ అధ్యక్షులు పంబాల అరవింద్ ,బీజేవైఎంఉపాధ్యక్షులు సాయికుమార్ ,ముత్యoపల్లి బూత్ అధ్యక్షులు హనుమంతు,సంతోష్ మహేష్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు

