మనసున్న మహారాజు
పెద్దనపెల్లి సర్పంచి
వేముల కృష్ణ.
పేదింటి అమ్మాయి పెళ్ళికీ
గ్రామ సర్పంచ్ కళ్యాణ
కానుకగా 5,016 అందజేత.
Scv News Kasipet :-
గ్రామీణ ప్రాంతాలలో పంచాయితీ ఎన్నికల్లో గ్రామస్తుల కష్టసుఖాల్లో అండగా ఉంటానని హామీలు ఇచ్చి సర్పంచులు గా ఎన్నికైన వారు ఎందరో ఉన్నారు. చాలా మంది సర్పంచులు తాము ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ధనార్జనే ధ్యేయంగా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే సర్పంచ్ పదవులను వాడుకుం టున్నారు. పంచాయతీ కార్యాలయానికి పనుల కోసం వచ్చే ప్రజల వద్ద ప్రతి పనికి పైసలు తీసుకుని పని చేస్తున్న నేటి రోజుల్లో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు నేనున్నా నంటూ కాసిపేట మండలంలోని పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ణ అండగా నిలుస్తున్నాడు. పంచాయతీ అభివృద్ధి తో పాటు కష్టాల్లో ఉన్న పేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పంచాయతీ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు తన పంచాయతీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణి కానుకగా 5,016 లో చీరే,సారే ఇచ్చి ఆదుకుంటూ మనసున్న మానవతా మూర్తిగా పంచాయతీ ప్రజల గుండెల్లో నిలుస్తున్నాడు. తన మూడేళ్ల పదవీ కాలంలో ఐదుగురు పేదింటి ఆడపిల్లలకు కళ్యాణి కానుకల కింద ఆర్థిక సహాయం అందజేసి మండల సర్పంచులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఈ రోజు పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ లోని పేద కుటుంబం కు చెందిన కలువల రమాదేవి కుమార్తె కావ్య శ్రీ కి పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ దంపతులు కళ్యాణ కానుకగా 5,016 లు చీర,సారె అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. రమాదేవి భర్త కల్వల శ్రీనివాస్ అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఇద్దరు పిల్లలు చిన్న వయసులో ఉండగానే భర్త మరణించడంతో కుటుంబ భారం మొత్తం రమాదేవి పై పడింది.రమాదేవినే అన్ని తానై కూలినాలి పనులు చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. పెద్ద కుమార్తె కావ్య శ్రీ వివాహం రేపు తేదీ 18-05-2022 బుధవారం ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొత్త రమేష్,బొల్లపెల్లి కొమురక్క , నాయకులు కూకట్ల దేవెందర్, గాదం గట్టయ్య,సోమగూడెం ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, నంది కొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

